స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటేస్ట్ మూవీ భోళా శంకర్. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తి సురేష్ ఇంకా అలాగే సుశాంత్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఇంకా అలాగే ఇదివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా శనివారం నాడు సాయంత్రం భోళా శంకర్ టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్.ఇక తాజాగా విడుదలైన టీజర్… ఆధ్యంతం యాక్షన్ కమ్ సిస్టర్ సెంటిమెంట్‏తో సాగుతుంది.అలాగే ఎప్పటిలాగే ఈ మూవీలో మెగాస్టార్ మార్క్ కామెడీతోపాటు ఇంకా మాస్ యాక్షన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 


“స్టేట్ డివైడ్ అయినా.. అందరు నావాళ్లే.. ఆల్ ఏరియాస్ అప్నా హై.. నాకు హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్.. ” అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ పై మరింత హైప్ ని క్రియేట్ చేస్తుంది. ఈ మూవీకి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.మెహర్ రమేష్ మొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నారు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేందుకు భారీగానే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ నుంచి కొద్ది రోజలుగా చిరు లీక్స్ అంటూ షూటింగ్ ఫోటోస్, వీడియోస్ వస్తున్నాయి. ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక చూడాలి ఈ సినిమాతో మన మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఓ సూపర్ దూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటాడో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: