ఆనంద్ దేవరకొండ తాజాగా బేబీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా ... సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూలై 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ కి నైజాం ఏరియాలో అదిరిపోయే రేంజ్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో ఐదు రోజుల్లో రోజు వారిగా ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయో తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 1.20 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి రెండవ రోజు 1.35 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

3 వ రోజు ఈ మూవీ కి నైజాం ఏరియా లో 1.38 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

4 వ రోజు ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.70 కోట్ల కలెక్షన్ దక్కాయి.

5 వ రోజు ఈ మూవీ కి నైజం ఏరియాలో 1.18 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. 

మొత్తంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో 6.81 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ సినిమా ఇప్పటికే నైజాం ఏరియాలో 6.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి నైజాం ఏరియాలో భారీ మొత్తంలో లాభాలను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: