టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంకా తమిళ స్టార్ హీరో ధనుష్ కాంబోలో మూవీ రాబోతున్న విషయం అందరికీ తెలిసేందే. ధనుష్ D51గా పట్టాలెక్కనున్న ఈ సినిమా నుంచి పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.ఆ పోస్టర్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల చూపించిన కాన్సెప్ట్.. 'అసమానతను సూచిస్తూ, నగరాన్ని విభజించే కరెన్సీ నోట్లు ఇంకా ఎంతో ఖరీదైన భారీ బిల్డింగులు..అలాగే మరోవైపు పేదరికాన్ని ప్రతిబింబించేలా మురికివాడలు..ఈ రెండింటికి మధ్యలో పాత వంద రూపాయల నోట్ల కట్టని' చూపించిన పోస్టర్ అయితే బాగా ఆకట్టుకుంటోంది. దీంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల సోషియో పొలిటికల్ జానర్లో మరో లీడర్ మూవీని చూపిస్తారని ధనుష్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. హీరో ధనుష్ తో సమాజాన్ని ఉద్దేశించే ఒక మంచి కథతో.. ఒక మంచి మార్పును తీసుకురావడం కోసం.. శేఖర్ కమ్ముల కేవలం స్క్రిప్ట్ కోసమే ఏకంగా రెండేళ్లు వర్క్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది.


సహజంగా శేఖర్ కమ్ముల సినిమాలలో కథా బలం ఎక్కువగా కనిపిస్తోంది.దానికి తోడు ధనుష్ లాంటి టాలెంటెడ్ హీరోతో రావడం..ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.శేఖర్ కమ్ముల రానా తో తీసిన లీడర్ మూవీ అప్పట్లో సోసైటీ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. ఇక ధనుష్ 51వ పోస్టర్ రావడంతో మరోసారి శేఖర్ కమ్ముల నుంచి సమాజాన్ని ప్రశ్నించేలా ఇంకా సోసైటీలో అసమానతల్ని ఎత్తి చూపుతూ తనదైన మార్క్ ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దుతారనే విషయం ఇప్పుడు అర్ధమవుతోంది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తాడని టాక్ వినిపిస్తోంది. హాట్ బ్యూటీ రష్మిక మందన్న ధనుష్ కు జోడీగా కనిపించబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది.ధనుష్ 51వ సినిమాని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఫ్యాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ధనుష్‌ను మునుపెన్నడూ చూడని గెటప్ లో చూడబోతున్నట్టు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

D51