ఆయన వేసిన బాటలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ , వరుణ్ తేజ్ , వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఇలా ఎంతోమంది మెగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. చిరంజీవి సినిమాల్లోకి రావడానికి చెన్నైలో ఉన్న ఒక యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకొని ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. మొదట్లో హీరోగా అవకాశాలు రాకపోయినా సెకండ్ హీరోగా, విలన్ గా నటించి ఆ తర్వాత హీరోగా మారారు.
ఇక హీరోగా ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన ఒక సీరియల్లో చేశారన్న విషయం బహుశా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. అయితే అది తెలుగులో కాదు హిందీలో..బాలీవుడ్ లోని ఒక హిందీ సీరియల్ లో చిరంజీవి నటించారు. అప్పట్లో దూరదర్శన్లో ప్రసారమైన రజిని అనే ధారావాహికలో చిరంజీవి అతిథి పాత్ర పోషించి అది కూడా ఒక్క ఎపిసోడ్లో మాత్రమే కనిపించడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవికి వరుసగా సినిమాలలో అవకాశాలు రావడంతో మళ్లీ సీరియల్స్ వైపు ఆయన చూడలేదు.
అయితే కొన్ని సంవత్సరాల తర్వాత బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షో కి హోస్టుగా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం తెలిసి అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా చిరంజీవి ఇప్పుడు ఆరుపదుల వయసు దాటినా కూడా వరుసగా సినిమాలను ప్రకటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి