ఇక గత కొంతకాలం నుంచి అయితే వరుస సినిమాలతో సూపర్ హిట్ సాధిస్తూ బిజీ బిజీగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. అయితే ఒక సీనియర్ హీరోయిన్ తో మాత్రం నటించే ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడట. ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో ఎప్పటికి నిలిచిపోయిన సౌందర్య. సౌందర్యతో మహేష్ బాబు నటించటం ఏంటీ.. ఈ కాంబినేషన్ కలలో కూడా ఊహించలేదు అనుకుంటున్నారు కదా. అయితే ఈ కాంబినేషన్ ఒకసారి ప్రేక్షకులను పలకరించాల్సి ఉన్న చివరికి సినిమా క్యాన్సిల్ అయింది.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన యమలీల సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో అలీ హీరోగా నటిస్తే ఇంద్రజ హీరోయిన్గా నటించింది. అయితే ముందుగా krishna REDDY' target='_blank' title='ఎస్ వి కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎస్ వి కృష్ణారెడ్డి ఈ కథను తయారు చేసిన సమయంలో హీరోగా మహేష్ బాబును హీరోయిన్గా సౌందర్య ఉంటే బాగుంటుందని అనుకున్నారట. వారి కోసమే కథను రాసుకున్నారు. అయితే మహేష్ బాబుతో సినిమా చేయాలని కృష్ణ గారికి కథ వినిపిస్తే మహేష్ ఇప్పుడు చిన్నోడని మరో మూడేళ్లు ఆగాలని చెప్పాడట. ఈ సినిమా విడుదల సమయానికి మహేష్ బాబు 19 ఏళ్ళు మాత్రమే. ఇక సౌందర్య వయసు 22 ఏళ్ళు. అంటే సౌందర్య మహేష్ బాబు కంటే మూడుమూడేళ్లు పెద్దది. ఈ సినిమా విడుదలైన ఐదేళ్లకి రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా సౌందర్య మహేష్ బాబు కాంబినేషన్ క్యాన్సిల్ అయిందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి