అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు. పార్టీని నడిపేందుకు తనకు సినిమాలు తప్ప వేరే ఒక ఆప్షన్ లేదని చెబుతూ ఇక సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చిన కొన్నాళ్లకే భారీ విజయాలను ఖాతాలో వేసుకున్నారు. ఇక మెగా అనే బ్యాగ్రౌండ్ కూడా ఉండడంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయారు. అయితే ఖుషి లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత అటు పవన్ కళ్యాణ్ చేసిన జానీ మూవీ మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ఇదే సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇక పవన్ సరసన హీరోయిన్గా నటించింది. అయితే హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చివరికి అట్టర్ ఫ్లాప్ అయింది. కథనం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా ప్లాప్ తర్వాత కష్టాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు రెమ్యూనరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేశాడట పవన్. ఏకంగా ఇష్టంగా వ్యవసాయం చేసుకుందామనుకున్న భూమిని అమ్మేసి మరి డబ్బులు ఇవ్వాలని అనుకున్నాడట. ఈ విషయం తెలిసి నాగబాబు, మెగాస్టార్ ఇక భూమిని అమ్మకుండా ఆపి కొంత సహాయం చేశారట. ఈ విషయాన్ని గతంలో నాగబాబు ఇంటర్వ్యూలో చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి