దీనిలో భాగంగానే అధికారులు నేడు టెట్ హాల్ టికెట్స్ ను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tstet.cgg.gov.in/ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోగలరని అధికారులు తెలియజేసారు.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక సైట్ ను సందర్శించి.. తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సెస్టెంబర్ 15 వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్షను , అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షను ను నిర్వహించనున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ 27న ఫలితాలను విడదుల చేస్తామని అధికారులు నోటిఫికేషన్లో వెల్లడించారు.ఇదిలా ఉంటే దాదాపు ఆరు సంవత్సరాల తరువాత తెలంగాణ ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దాదాపు 5,089 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ నెల 20 వ తేదీ నుండి అక్టోబర్ 21 వ తేదీ వరకు కొనసాగుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి