అయినప్పటికీ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా తన క్రేజ్ ను మాత్రం అంతకంతకు పెంచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తూ అభిమానులందరికీ ఎవర్గ్రీన్ సినిమాగా నిలిచిన మూవీ ఏది అంటే అందరూ గబ్బర్ సింగ్ అని చెబుతారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్పాలి. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కు ఒక సాలిడ్ విజయాన్ని అందించింది. అయితే ఈ సినిమా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాకు రీమేక్
ఒరిజినల్ మూవీ స్టోరీ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేశాడు హరీష్ శంకర్. 2012 మే 11వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాకుండా మరో హీరో చేసి ఉంటే ఇంత హిట్ అయ్యేది కాదు అని అందరూ అనుకున్నారు. కానీ ముందుగా గబ్బర్ సింగ్ కథను పవన్ కళ్యాణ్ కోసం రాసుకోలేదట డైరెక్టర్ హరీష్ శంకర్. మాస్ మహారాజా రవితేజతో ఈ మూవీ చేయాలని అనుకున్నాడట. అప్పటికే రవితేజ హరీష్ శంకర్ కాంబోలో షాక్, మిరపకాయ లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. దీంతో రవితేజతో ఈ మూవీ చేయాలని అనుకున్నాడు. కానీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో చివరికి పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు హరీష్ శంకర్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి