ఆహా ఓటీటీ లో బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే సక్సెస్ఫుల్గా రెండు సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఆహా హిస్టరీలోనే అన్నిటికంటే ఎక్కువ ఆదరణ పొందిన షోగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలయ్య హోస్టుగా ఇతర సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే కావలసినంత ఫన్ తో పాటు బోలెడంత ఇన్ఫర్మేషన్ కూడా లభించింది. ఈ కారణంగానే ఈ షో కి అదిరిపోయే ఆదరణ లభిస్తోందని చెప్పవచ్చు.

 ఇలా ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే మూడవ సీజన్ కి ఆరంభం పలుకుతోంది. ఇక ఈ షో సీజన్ 3 ని మొదలు పెట్టాలని ఆహా టీమ్ ఆలోచిస్తోంది. ఇప్పటికే రంగం కూడా సిద్ధం చేసింది. షో కి మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని పిలవాలని అంతా ఫిక్స్ అయ్యారు. చిరంజీవి కూడా వస్తానని మాట ఇచ్చారు. ఇక బాలయ్య - చిరంజీవి మధ్యలో చిన్న మనస్పర్ధలు ఉండడంతో వాటికి ఈ షో ద్వారా పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేయాలని ఆహా ఆలోచనలో పడింది . అలాగే సీజన్ 3 కోసం తెలంగాణ ఐటి మినిస్టర్ కేటిఆర్ ని కూడా ఇక్కడికి ఆహ్వానించబోతున్నారు. వీరితోపాటు రామ్ చరణ్ , విక్టరీ వెంకటేష్ వంటి స్టార్లు కూడా వస్తున్నారని తెలుస్తోంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఈ షోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలాకాలంగా బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాల వల్ల కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై కూడా ఎన్టీఆర్ స్పందించలేదు. ఇక టిడిపి నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్టుపై స్పందించాలని డిమాండ్ చేస్తుండగా.. తారక్ మాత్రం తన సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాబాయి - అబ్బాయి అన్ స్టాపబుల్ సోలో పాల్గొనడం అసంభవంగా అనిపిస్తుంది. ఒకవేళ షో కి హాజరైతే ఎన్నో విషయాలపై ఓపెన్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్ సాధ్యం కాదనే కామెంట్లు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: