బుల్లితెరపై ఫేమస్ యాంకర్ల లో ఒకరు అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షో ద్వారా ఈ బ్యూటీ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకుంది.ఈ షో వలనే ఆమెకు సినిమా లలో అవకాశాలు వస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే టాలీవుడ్లో చాలా సినిమాలలో నటించిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. ఆ మధ్య విమానం సినిమాతో వేశ్య పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. 

ఇకపోతే అనసూయ సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు.సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అందచందాలతో పాటు చురుకైన మాటలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా తప్పుడు పనులు చేస్తున్నా, ఏ ఒక్కరిని వదిలేది లేదు అన్నట్లుగా వార్నింగ్ ఇస్తూ వస్తుంది. తనను ట్రోల్ చేసిన వారికి ఎన్నోసార్లు గట్టిగా కౌంటర్లు కూడా ఇచ్చింది. అయినా అనసూయ పై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

పర్పుల్ శారీలో మత్తెక్కించే చూపులతో అనసూయ అందరిని మాయ చేసింది. ఈ లేటెస్ట్ పిక్స్ కుర్రకారును నిద్రపోకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పర్పుల్ శారీ లో అనసూయ టూ హాట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోలకి అభిమానులు వేలలో లైకులు వర్షం కురిపించారు. ఇకపోతే ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. అలాగే సింబా, హరిహర వీరమల్లు, ఫ్లాష్ బ్యాక్ సినిమాలలో నటిస్తోంది. జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: