మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కన్నడ సినిమా అయినటువంటి కిరిక్ పార్టీ మూవీ తో అద్భుతమైన గుర్తింపును సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత ఈ నటి తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా నాగ శౌర్య హీరోగా వెంకి కుడుమల దర్శకత్వంలో రూపొందిన ఛలో అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ను అందుకుంది.

ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన గీత గోవిందం మూవీ తో మరో బ్లాక్ బస్టర్ మూవీ ని తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక ఈ రెండు విజయాలతో ఈ నటి క్రేజ్ అమాంతం తెలుగు సినీ పరిశ్రమలో పెరిగిపోయింది. ఆ తర్వాత ఈ నటికి వరుసగా తెలుగు స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడంతో అతి తక్కువ కాలంలోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదిగిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అనేకం సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి యనిమల్. ఈ మూవీ కి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... రన్బీర్ కర్పూర ఈ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాని మరికొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

అందులో భాగంగా ఈ మూవీ బృందం సెప్టెంబర్ 28 వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి రష్మిక కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో ఈ నటి చాలా పద్ధతి గల అమ్మాయిగా చాలా సాంప్రదాయ బద్ధమైన లుక్ లో ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ పోస్టర్ ను బట్టి చూస్తే ఈ సినిమాలో రష్మిక చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: