ఉస్తాద్ రామ్ పోతినేని తాజాగా స్కంద సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకి టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రిన్స్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ లో హీరో గా నటించిన రామ్ ... హీరోయిన్ గా నటించిన శ్రీ లీల కూడా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా వీరిద్దరు ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను కూడా చెప్పుకొచ్చారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ స్కంద మూవీ ప్రమోషన్ లలో భాగంగా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో కు గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే రామ్ కి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ ను కూడా ఇప్పటికే బిగ్ బాస్ బృందం వారు చిత్రీకరించినట్లు ... ఆ ఎపిసోడ్ ను ఈ రోజు రాత్రి ప్రసారం చేసే విధంగా బిగ్ బాస్ యూనిట్ కార్యాచరణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రామ్ ఆఖరిగా నటించిన ది వారియర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి స్కంద మూవీ తో ఈ యువ నటుడు ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: