టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో సీనియర్ హీరోగా కొనసాగుతున్న నాగార్జున గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా చక్రం తిప్పుతూ ఉన్నాడు నాగార్జున. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నాగార్జున.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు 60 ఏళ్ల వయసు లో కూడా టాలీవుడ్ మన్మధుడుగా అమ్మాయిల మనసు దోచుకునే హీరోగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే నాగార్జున సినిమాల్లో మన్మధుడు అని పేరు తెచ్చుకోవడమే కాదు రియల్ లైఫ్ మన్మధుడు అని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది.



 ఎందుకంటే నాగార్జున తనతో కలిసి నటించిన ఎంతోమంది హీరోయిన్లతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు అంటూ టాక్ ఉంది. కొంతమందితో ఎఫైర్ కూడా పెట్టుకున్నాడు అంటూ ఎన్నో వార్తలు తెరమీదకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో లేడీ మ్యాన్ అనే పేరు కూడా నాగార్జునకు వచ్చింది. ఇలా హీరోయిన్లతో ఎంతో చనువుగా ఉండే నాగార్జున ఎప్పుడు ఏ హీరోయిన్ కు భయపడలేదు. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం నాగార్జునను ఎంతగానో భయపెట్టిందట. ఆ హీరోయిన్  ఎవరో కాదు అతిలోకసుందరి శ్రీదేవి.



 శ్రీదేవి నాగార్జున కాంబినేషన్లో నాలుగు సినిమాలు ప్రేక్షకుల  ముందుకు వచ్చాయి. వాటిలో రెండు హిందీ సినిమాలు అయితే.. రెండు తెలుగు సినిమాలు.  తెలుగులో అయితే వీరిద్దరూ గోవిందా గోవిందా, ఆఖరిపోరాటం అనే సినిమాలలో కలిసి నటించారు ఈ జోడి. అయితే శ్రీదేవిని చూసి నాగార్జున ఎంతగానో భయపడిపోయారట. అందుకు కారణం శ్రీదేవి టాలీవుడ్ అగ్ర హీరోలైన ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్ లాంటి అగ్రనటులతో నటించడమె. ఇలాంటి పెద్ద హీరోయిన్ తో నేను నటించగలనా అని భయపడేవారట. కానీ శ్రీదేవి కోఆపరేషన్ తోనే రెండు సినిమాలను నాగార్జున విజయవంతంగా పూర్తి చేశాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: