సింగర్ చిన్మయి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ సమంత కెరియర్ లో టాప్ హిట్ మూవీస్ గా పేరు తెచ్చుకున్న అనేక సినిమాలకు సమంత పాత్ర కు చిన్మయి డబ్బింగ్ చెప్పడంతో ఆమెను సమంత ఆత్మ అంటూ అనేకమంది ఆమె పై ప్రశంసలు కురిపించారు. దీనికితోడు చిన్మయి సమంతల స్నేహం కూడ అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతోంది.చిన్మయి భర్త నటుడు రాహుల్ రవీంద్రన్ ను దర్శకుడుగా మారడంలో సమంత పరిచయం అతడికి ఎంతగానో సహకరించింది అని కూడ అంటారు. నాగార్జున మేనల్లుడు సుశాంత్ తో రవీంద్రన్ తీసిన ‘చి లా సౌ’ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా అప్పట్లో సమంత ఒత్తిడి వల్ల రాహుల్ రవీంద్రన్ కు నాగార్జునతో ‘మన్మధుడు 2’ తీసే అవకాశం దక్కింది అన్న ప్రచారాం కూడ జరిగినది.అయితే ఆసినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో రాహుల్ కు దర్శకుడుగా మళ్ళీ అవకాశాలు రాలేదు. అయితే మంచి కథకుడు కూడ అయిన రాహుల్ తాను తయారు చేసుకున్న ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది అన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో సమంత స్థానంలో రష్మిక వచ్చి చెరినట్లు లీకులు వస్తున్నాయి.అల్లు అరవింద్ బన్నీ వాసు ల నిర్మాణ సారధ్యంలో త్వరలో ప్రారంభం కానున్న ఈమూవీలో హీరోయిన్ గా సమంత కాకుండా రష్మిక వచ్చి చేరడంతో ఆమెకు ఎంతో సన్నిహితమైన రాహుల్ రవీంద్రన్ చిన్మయి ల నుండి కూడ్డ ఊహించని షాక్ తగిలిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక కెరియర్ కూడ అంతంతమాత్రంగానే ఉంటోంది. దీనితో ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల వైపు కూడ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ‘బటర్ ఫ్లై’ అన్న హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో చేస్తున్న రష్మిక ఇప్పుడు ఏకంగా సమంత ప్లేస్ ను భర్తీ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..
మరింత సమాచారం తెలుసుకోండి: