యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని కొంత కాలం క్రితం సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఆ తర్వాత ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ బృందం ఈ సినిమాని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయడం లేదు అని ఈ మూవీ కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లోనే ప్రకటించబోతున్నట్లు ప్రకటించారు. 

ఇకపోతే గత కొన్ని రోజులుగా సలార్ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా సలార్ మూవీ బృందం ఈ సినిమా విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇకపోతే సలార్ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్.లో ప్రభాస్ బనీన్ లో ఒంటినిండా రక్తం తో ఉన్నాడు.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇకపోతే సూపర్ క్రేజ్ ఉన్న ప్రభాస్ , ప్రశాంత్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ కావడంతో ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ కి రవి బుస్రుర్ సంగీతం అందిస్తూ ఉండగా ... హోంబులే ఫిలిమ్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: