సీరియల్ హీరోగా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన సోహైల్.. ఇప్పుడు హీరో గా ఆకట్టుకుంటున్నాడు.బిగ్‏బాస్ రియాల్టీ షో తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు సోహైల్.ఇటీవల సోహైల్ మామ ఆర్గానిక్ అల్లుడు హైబ్రిడ్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో సరికొత్త కథల తో ప్రేక్షకులని మెప్పించాలనే ఉద్దేశంతో హీరో సోహైల్ విభిన్న కథలను సెలెక్ట్ చేసుకునే పని లో వున్నాడు. దానిలో భాగంగా ఇటీవల మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

సినిమా ను శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో సోహైల్ సరసన రూపా కొడువాయూర్ కథనాయికగా నటించింది. అలాగే సుహాసిని, రజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషించగా మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి నిర్మించారు.ఆగస్ట్ 18 న విడుదలై ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. పురుషుడు గర్భం దాలిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.. అనే సరికొత్త కథాంశంతో ఈ సినిమా ను రూపొందించారు.థియేటర్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఈ ఓటీటీ లో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటి సంస్థ ఆహా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రాన్ని అక్టోబర్ 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వెల్లడించింది. 'మిస్టర్ ప్రెగ్నెంట్.. వినడానికే కొత్తగా ఉంది కదా. ఎంటర్టైన్మెంట్ కూడా కొత్తగానే ఉంటుంది. ఎమోషనల్ డ్రామా కోసం మీరంతా రెడీగా ఉండండి. అక్టోబర్ 6న మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ప్రీమియర్ కానుంది' అంటూ ఆహా ఓటీటీ పోస్ట్ చేసింది.ఇదిలా ఉంటే ఈ సినిమా ఆహాతోపాటు,అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఆక్టోబర్ 6 నుంచి ఈ ప్రేక్షకులకు ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: