టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఏ సినిమా ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రాలు సైతం భారీగా విజయాలు అందుకుంటున్నాయి. భారీ ప్రమోషన్స్ చేసిన చిత్రాలు భారీ డిజాస్టర్ ని మూటకట్టుకుంటున్నాయి అలా చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు చాలా సినిమాలు ఫెయిల్యూర్ సక్సెస్ గా అందుకున్నాయి. అయితే ఈ ఏడాది టైర్-2 హీరోల సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సినిమాలు కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చాయి వాటి గురించి తెలుసుకుందాం.


ముఖ్యంగా ఈ ఏడాది మొదటిలో నాచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా మూవీ దసరా. ఈ సినిమా నాని పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. పీరియడ్ ఏరియాలలో 80% రికవరీ కాక కేవలం 1.3 నష్టాన్ని మిగిల్చింది. విజయ్ దేవరకొండ నటించిన ఇటీవలే ఖుషి సినిమా ఓటీటి లో కూడా బాగానే ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా 38% రికవరీతో..3.4 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఇటీవలే రామ్ పోతినేని డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన స్కందా సినిమా.. 47% రికవరీ అయినట్లుగా తెలుస్తోంది అంచనా ప్రకారం ఈ సినిమా 4 కోట్లకు పైగా నష్టాన్ని మిగులుస్తుందని తెలుస్తోంది.


నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా 25% రికవరీతో 2 కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా థియేటర్లో ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది. ఈ సినిమా 18 శాతం రికవరీ మాత్రమే రాబట్టింది ఈ సినిమా 3.7 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ నటించిన గాండీవ దారి అర్జున సినిమా జీరో షేర్స్ ని రాబట్టింది. ఈ సినిమాలన్నీ కూడా ఈ ఏడాది సీడెడ్ లో మిగిల్చిన నష్టాలని చెప్పవచ్చు. అయితే టైర్-2 హీరోలలో మాత్రం విరూపాక్ష సినిమానే లాభాల బాట పట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: