కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న తాజా చిత్రం లియో.. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఈనెల 19వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాకు మంచి పాపులారిటీ అందుకుంది. విలన్ గా సంజయ్ దత్ కీలకమైన పాత్రలో అర్జున్ దాస్ నటిస్తూ ఉండడంతో పాటు హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉన్నది. ఈ సినిమా కూడా డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.. అభిమానులు అంచనాలను తగ్గట్టుగానే ఈ సినిమా ట్రైలర్ ఉండడం జరిగింది.



లోకేష్ కనకరాజు ఈ మధ్యకాలంలో తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం గమనార్హం. లియో సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్స్ పైన టార్గెట్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 70 వేల టికెట్లకు పైగా అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లియో సినిమా మొదటి రోజు విదేశాలలో 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయనుందని ఇక ఇండియాలో 60 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు..


కేరళ వంటి ప్రాంతంలో 5 కోట్లు .. ఇక ఓవర్సీస్ లో ఇప్పటివరకు జరిగిన అమ్మకాల ప్రకారం..$8 మిలియన్ డాలర్లను సంపాదించినట్లు తెలుస్తోంది. మన కరెన్సీ ప్రకారం 66.6 కోట్ల రూపాయల గ్రాస్ రూపాయలను వసూలు చేస్తుందని ధృవీకరించబడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సౌత్ టాక్ కు అనుకూలంగా పొందితే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా తమిళ చిత్రానికి సంబంధించి ఫ్రీ సేల్స్ ద్వారానే అన్ని దేశాలలో జరుగుతున్నాయి.చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో రిలీజ్ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు షో ని మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా టికెట్లు ధర కూడా ఏకంగా రూ.2400 రూపాయల వరకు అమ్ముడుపోతున్నట్లు సమాచారం. ఇక నార్త్ లో అయితే 300 నుంచి 700 వరకు పోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: