వివాహాని కంటే ముందుగానే ఈమె కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నటువంటి ఇండియన్ 2 సినిమాకు కమిట్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొని ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు అలాగే అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించారు. అదేవిధంగా సత్యభామ అనే మరొక సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ అగర్వాల్ భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇన్ని రోజులు తాను ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సమస్య గురించి బయటపెట్టారు. ఇలా ఈ విషయం గురించి కాజల్ అగర్వాల్ మాట్లాడటంతో ఇన్ని రోజుల నుంచి కాజల్ ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మరి ఈమెను వెంటాడుతున్నటువంటి ఆ సమస్య ఏంటి అనే విషయానికి వస్తే ఎంత డైట్ చేసినా.. ఎన్ని వర్కౌట్స్ చేసినా.. తన బాడీకి ఏం కాదట. ఫుడ్ తిన్న కూడా బరువు పెరగదట.
ఒకవేళ తాను ఏవైనా పనుల్లో పడిపోయి మూడు రోజులు నాలుగు రోజులు జిమ్ కి వెళ్ళకపోతే మాత్రం బీభత్సంగా బరువు పెరిగిపోతుందట. ఇలా పెరిగిన శరీర బరువు తగ్గించుకోవడం కోసం తిరిగి తాను నాలుగు రోజులపాటు జిమ్ లో భారీగా కష్టపడాల్సి వస్తుందంటూ ఈ సందర్భంగా కాజల్ తాను ఎదుర్కొంటున్నటువంటి వింత సమస్య గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాజల్ అగర్వాల్ ఇలాంటి వింత సమస్యతో బాధపడటం వల్లే తనకు ఎన్ని పనులు ఉన్న జిమ్ మాత్రం మానను అంటూ ఓపెన్ గానే చెప్పుకు వచ్చింది. ఇలా ఈమె తనకు ఉన్నటువంటి ఈ వింత సమస్య గురించి తెలియజేయడంతో ఇది కూడా ఒక సమస్యనా అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అయితే హీరోయిన్ కి ఫిట్నెస్ ఎంతో ముఖ్యం కనుక సెలబ్రిటీలకు ఇంత చిన్న సమస్యలు కూడా పెద్దవిగానే కనిపిస్తాయి అనడంలో సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి