తమిళ అమ్మాయిగా కీర్తి సురేష్ అటు టాలీవుడ్ బాలీవుడ్లో ఎంతటి పేరు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చేతినిండా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. మరొకవైపు నిరంతరం ఏదో ఒక వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. కీర్తి సురేష్ 1992 అక్టోబర్ 10వ తేదీన చెన్నైలో జన్మించింది. ఇమే తండ్రి కూడా నిర్మాత కావడం విశేషం. ఈమె తల్లి మేనక కూడా తమిళ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ చైల్డ్ యాక్టర్ గా కూడా నటించి మంచి పాపులారిటీ అందుకుంది.


మలయాళం లో హీరోయిన్ గా గీతాంజలి, రింగ్ మాస్టర్ అనే చిత్రాలతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ్ తెలుగులో ఫుల్ సినిమాలలో నటించింది మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.. కానీ తెలుగులో మహానటి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ రేంజిలో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకోవడం గమనార్హం. ఇటీవల ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు ఒక వస్తున్నట్లు తెలుస్తోంది కీర్తి సురేష్.


కీర్తి సురేష్ కి ఒక చెల్లెలు కూడా ఉంది ఆమె పేరు రేవతి సురేష్..Vfx స్పెషలిస్ట్ అన్నట్టుగా సమాచారం. అప్పుడప్పుడు తన చెల్లితో కలిసి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ మహానటి సినిమాకి తొలిసారిగా కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పుకుంది. గత కొద్దిరోజులుగా కీర్తి సురేష్ కు సంబంధించి పెళ్లి రూమర్స్ అయితే వైరల్ గానే మారుతూ ఉన్నాయి. కానీ ఈమె మాత్రం ఈ విషయాలను కొట్టి పారేస్తోంది. ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ జువెలరీ వ్యాపారం లోకి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం .త్వరలోనే దాని ఒక సొంత బ్రాండ్ ను సైతం లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: