బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. వాటితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు యానిమల్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ కి అర్జున్ రెడ్డి మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించగా ... టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాని డిసెంబర్ 1 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

అలాగే ఈ మూవీ బృందం ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ కి "ఏ" సర్టిఫికెట్ సెన్సార్ బోర్డు నుండి దక్కగా ... ఈ మూవీ 3 గంటల 21 నిమిషాల 16 సెకండ్ల భారీ నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ మూవీ రన్ టైమ్ కి సంబంధించిన మరో వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి 3 గంటల 50 నిమిషాల నిడివితో రానున్నట్లు థియేటర్ ప్రింట్ లో ఎడిట్ చేసి తీసివేసిన కొన్ని సన్నివేశాలు "ఓ టి టి" వర్షణో ఉండబోతున్నట్లు దానితో ఈ సినిమా రన్ టైమ్ మరింతగా పెరిగినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: