బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ శుక్రవారం (డిసెంబర్ 1) యానిమల్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాపై సందీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. యానిమల్ మూవీకి సీబీఎఫ్‌సీ వాళ్లు ఎ సర్టిఫికెట్ ఇవ్వడం సంతోషంగా ఉందని సందీప్ అన్నారు..ఈ సినిమా పిల్లలు చూసేది కాదని అతడు స్పష్టం చేశాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ లోనే విపరీతమైన వయోలెన్స్ ఉండటంతో ఊహించినట్లే సెన్సార్ బోర్డు కూడా 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ సినిమా చూడాల్సి ఉంటుంది.అయితే తన సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి మాత్రం సంతోషం వ్యక్తం చేశాడు. నిజానికి ఈ సినిమా పిల్లలు చూసేలా ఉండదని సందీప్ స్పష్టం చేసారు.. "యానిమల్ విషయానికి వస్తే సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ రావడం సంతోషం. 18 ఏళ్ల లోపు వారికి ఇది సూటయ్యే సినిమా కాదు. నా కొడుకు అర్జున్ అలాగే నా సోదరుడి పిల్లలు లేదంటే కజిన్స్ పిల్లలను కూడా థియేటర్లలో సినిమాకు తీసుకెళ్లను. పిల్లల కోసం కట్ చేసిన వెర్షన్ తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను. నా కుటుంబంలో 8 నెలల నుంచి 17 ఏళ్లలోపు పిల్లలు చాలా మందే ఉన్నారు" అని సందీప్ రెడ్డి చెప్పాడు.ఇక సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపైనా స్పందించాడు. ఈ సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుందా అని ప్రశ్నించగా.. వసూళ్లు గురించి ఇప్పుడే నేను అంచనాలు వేయలేనని, అయితే సినిమా మాత్రం అందరినీ ఆలోచింపజేస్తుందని అన్నాడు. యానిమల్ మూవీలో అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో నటించారు.అలాగే బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు.ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుండగా.. సోమవారం (నవంబర్ 27) రాత్రి హైదరాబాద్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు డైరెక్టర్ రాజమౌళి హాజరయి సినిమాను, నటినటులను అలాగే దర్శకుడిని ఎంతగానో మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: