ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని మూవీ లు మరియు కొన్ని వెబ్ సిరీస్ లు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. మరి ఆ వెబ్ సిరీస్ లు ... మూవీ లు ప్రస్తుతం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

దూత : టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య మొట్ట మొదటి సారి నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. నాగ చైతన్య తన కెరియర్ లో మొట్ట మొదటి సారి నటించిన వెబ్ సిరీస్ కావడంతో దీనిపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

రూల్స్ రంజన్ : కిరణ్ అబ్బవరం హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

చిన్నా : సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తాజాగా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే మొదట తమిళం లో "చిత్తా" అనే పేరుతో విడుదల అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత "చిన్నా" పేరుతో తెలుగు లో విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సిద్ధార్థ్ స్వయంగా నిర్మించాడు.

మార్టిన్ లూథర్ కింగ్ : సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ott