సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది నయనతార. ఎన్నో సినిమాల్లో నటించి భారీ విజయాల నూతన సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించడంతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో చేసి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. స్టార్ హీరోల సరసన నటించిన తోపాటు అత్యధిక రెమ్యూనరేషన్ను తీసుకునే హీరోయిన్ల లిస్టులో ముందు వరుసలో ఉంటుంది నయనతార. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఇటీవల తన పుట్టినరోజుని చాలా గ్రాండ్ గా చేసుకుంది. పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు మరికొందరు

 ఆమె పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా తన భర్త విగ్నేష్ శివన్ నుంచి ఒక ప్రత్యేక బహుమతిని అందుకుంది నయనతార. ఈ విషయాన్ని రెండు వారాల తర్వాత సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. ఇంతకు నయన్‌కు అందిన పుట్టిన రోజు గిఫ్ట్ ఏంటో తెలుసా? రూ. 3 కోట్లు విలువ చేసే జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్. తాజాగా ఈ కారుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన నయన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. ‘వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ.. మై డియర్ హస్బెండ్, ఈ పుట్టిన రోజున మర్చిపోలేని గిఫ్ట్ ను ఇచ్చారు అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు..

ఇకపోతే మెర్సిడెస్కారు ప్రారంభ ధర రూ.2.69 కోట్లు కాగా నయన్‌ అందుకున్న కారు సుమారు రూ. 3.40 కోట్ల రూపాయల వరకు ఉంది. ఈ కారులో అనేక విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. నయనతార, విఘ్నేష్ శివన్ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత 2022 జూన్‌ 22న వివాహం చేసుకున్నారు. ఆపై అక్టోబర్‌లో అద్దె గర్భం ద్వారా కవలలకు జన్మనిచ్చారు ఈ లవ్లీ కపుల్‌. వారికి ఉయిర్, ఉలగ్ అని నామకరణం చేశారు. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. తెలుగు తమిళ సినిమాలే కాకుండా ఇటీవల బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. షారుక్ ఖాన్ నయనతార కాంబినేషన్లో వచ్చిన జవాన్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత నయనతారకి వరుస బాలీవుడ్ అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: