వాంటెడ్ చిత్రం 'డంకీ' కోసం పాన్ ఇండియా అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ మంగళవారం నాడు విడుదల కాగా..ఇప్పుడు ఆ ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశారు మేకర్స్. ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేసిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఈ ఇయర్ చివర్లో డంకీ సినిమాతో మరోసారి థియేటర్లలో రచ్చ చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ తో పోటీ పడనుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 21న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన తాప్సీ పన్నూ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ట్రైలర్, టీజర్ చూసిన అడియన్స్ వీరిద్దరిపై ఎన్నో ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇంకా అంతేకాకుండా చాలా కాలం తర్వాత తాప్సీ అడియన్స్ ముందుకు రాబోతున్నది.ఈ క్రమంలో డంకీ నటీనటుల రెమ్యునరేషన్స్ సోషల్ మీడియాలో  హల్చల్ చేస్తున్నాయి. కామెడీ ఎంటర్టైనింగ్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ కోసం షారుఖ్ ఖాన్ భారీగానే వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పుడు తాప్సీ రెమ్యునరేషన్ డీటెయిల్స్ కూడా నెట్టింట తెగ వైరలవుతున్నాయి.


టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ వెళ్లి అక్కడ ప్రముఖ నటీమణులలో ఒకరైన తాప్సీ పన్ను డంకీలో మన్ను పాత్రను పోషించినందుకు ఏకంగా రూ. 11 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో అభిమానులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కింగ్ ఖాన్ , తాప్సీ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ మూవీని షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై గౌరీ ఖాన్‌ నిర్మించారు. ఈ మూవీ ప్రేక్షకులకు ఒక ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది.ఇక ఇదిలా ఉంటే.. ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసే పనిలో పడ్డారు. నిన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. ఇక త్వరలోనే ప్రెస్ మీట్స్ కూడా నిర్వహించనుంది. ఇంకా అలాగే డంకీ ఈవెంట్స్ సైతం పెద్ద ఎత్తున జరగనున్నట్లు తెలుస్తోంది.  డిసెంబర్ 22న ప్రభాస్ నటించిన సలార్ విడుదల కాబోతుండడంతో షారుఖ్, ప్రభాస్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇటీవలే జవాన్ మూవీతో దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించాడు కింగ్ ఖాన్. మరి డంకి సినిమా ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: