బిగ్ బాస్ - 7 ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్లో విజేతగా ఎవరు నిలవబోతారు అనే చర్చే ప్రస్తుతం బుల్లితెరపై జరుగుతూ ఉంది. కాగా ఇక బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా ఈ విషయం తెలుసుకునేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న తమ అభిమాన కంటెస్టెంట్లను విజేతగా నిలిపేందుకు ఓటింగ్స్ వేసి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే గత కొన్ని వారాల నుంచి ఓటింగ్స్ లో అటు పల్లవి ప్రశాంత్ టాప్ లో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఇక ఆ తర్వాత తన ఆట తీరుతో తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా సెలబ్రిటీలుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ తో పోల్చి చూస్తే పల్లవి ప్రశాంత్ కి ఎక్కువ ఓటింగ్ కూడా వస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ప్రతివారం ఎలిమినేషన్ లో ఉంటున్న ప్రశాంత్ ఇక ఎలిమినేషన్స్ దాటుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే శివాజీ నేతృత్వంలో అతని ఆట తీరు మరింత మెరుగుపడింది అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి శివాజీకి అటు ఓట్లు తగ్గిపోతూ ఉండడం గమనార్హం.


 ఈ మధ్యకాలంలో ప్రతివారం గేమ్స్ స్ట్రాటజీని మార్చుకుంటూ వస్తున్న శివాజీ.. కాస్త సైలెంట్ గానే ఉంటున్నాడు. దీంతో విన్నర్గా నిలుస్తాడు అనుకున్న అతనికి.. ఓటింగ్ శాతం కూడా తగ్గిపోతుంది. అయితే గత రెండు వారాలుగా మైండ్ గేమ్ మార్చని కారణంగా.. శివాజీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోయింది. ఈ క్రమంలోనే 14వ వారంలో తన గేమ్ ని మార్చేశాడు శివాజీ. అయితే 14వ వారంలో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చి శోభ శెట్టిని సంచాలక్ గా పెట్టాడు. అయితే ఆమె ప్రియాంక గెలవాలని తరుచు ప్రయత్నాలు చేసింది. గట్టిగ అరుస్తూ కేకలు వేసింది. ఎలాగైనా సరే సీరియల్ బ్యాచ్ వాళ్లను ఓడించాలి. తాను విన్నర్ కావాలనే ప్లాన్ వేసినట్లు చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమైంది. ఇలా సైలెంట్ గా ఉండకుండా అగ్రసివ్ గేమ్ ఆడుతూ ఓట్లు సంపాదించాలని శివాజీ గేమ్ స్ట్రాటజీ మార్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: