టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా విభిన్నమైన కథాంశాలతో అభిమానులను సినీ ప్రేక్షకులను సైతం మెప్పిస్తూ ఉంటారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన rrr సినిమాతో అద్భుతమైన నటనను సైతం కనబరిచారు. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది.ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు కూడా నాటు నాటు పాటకి రావడం జరిగింది. ఈ సినిమా విడుదలైన అన్ని భాషలలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది.


అలాగే ఇందులో ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఇద్దరూ కూడా నటించారు. ఇద్దరికీ కూడా పలు రకాల అవార్డుల సైతం అందుకొంటూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ కు 2023 గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సైతం గెలుచుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రశంసలు పొందిన సినిమాగా rrr స్థానాన్ని అందుకోవడం జరిగింది. షారుక్, దీపిక, అదా శర్మ, తదితర నటీనటులు సైతం వీటికి నామినేషన్ చేసుకోగా ఇందులో కేవలం రామ్ చరణ్ కి మాత్రమే ఈ విజయం దక్కిందని చెప్పవచ్చు


ఎంతోమంది పోటీ ఉన్నప్పటికీ రామ్ చరణ్ కి సరైన గుర్తింపు దక్కిందని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ అభిమానులకు ఈ విషయం తెగ ఆనందాన్ని కల్పిస్తోంది. పాప్ గోల్డెన్ అవార్డు ఇయర్ ఆఫ్ ది బాలీవుడ్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్గా తెలుగు హీరో అందుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ ని ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.. రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాపాతోంది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: