ఇక నా సామిరంగ సినిమాను థియేటర్‌లో విడుదలైన 45 రోజుల తర్వాతే ఓటీటీలోకి విడుదల చేయనున్నారు. అంటే, వచ్చే నెల ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి నెలలో నా సామిరంగ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే, ఒక్కసారి ఓటీటీ సంస్థలు సినిమా హక్కులు కొనుగోలు చేస్తే వాటిని విడుదల చేసే నిర్ణయం వారి చేతుల్లోనే ఉంటుందని సమాచారం.. కొన్నిసార్లు నిర్మాతలతో చర్చించి కూడా ఎప్పుడూ ఓటీటీలో రిలీజ్ చేయాలో ప్లాన్ చేసుకుంటారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అయితే.. నా సామిరంగ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదా మార్చి మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారు. నా సామిరంగ మూవీ టాక్ మరియు బాక్సాఫీస్ కలెక్షన్స్ దృష్ట్యా విడుదల తేదీలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే నా సామిరంగ సినిమాలో నాగ్ తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కూడా ప్రధాన పాత్రలు పోషించారు.నాగ్ కు జోడీగా ఆషికా రంగనాథ్ నటించగా.. రాజ్ తరుణ్ కి జోడిగా రుక్సార్ దిల్లాన్ మరియు అల్లరి నరేష్ కు జోడిగా మిర్నా మీనన్ నటించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి