తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో గోపీచంద్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నింటితోనో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇలా ఇప్పటివరకు అనేక విజయాలను అందుకున్న గోపీచంద్ ఈ మధ్య కాలంలో మాత్రం వరుస అపజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొంటున్నాడు. ఆఖరుగా గోపీచంద్ "రామబాణం" అనే సినిమాలో హీరో గా నటించాడు. శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా ... జగపతి బాబు , కుష్బూ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా గోపీచంద్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ కన్నడ దర్శకుడు అయినటువంటి హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న "బీమా" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం వారు ఇప్పటికే ఈ సినిమా యొక్క సెకండ్ సింగిల్ అయినటువంటి "గల్లి సందులో" అంటూ సాగే సాంగ్ కి సంబంధించిన ప్రోమో ను విడుదల చేశారు.

దీనికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా లోని రెండవ పాట అయినటువంటి "గల్లీ సందులో" అంటూ సాగే పూర్తి లిరికల్ వీడియోను ఈ రోజు సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: