రీసెంట్ బ్లాక్ బస్టర్ ప్రేమలు సినిమా  కేవలం 3 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా 113 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించి ఇంకా దూసుకుపోతుంది.ప్రేమలు సినిమా సాధించిన కలెక్షన్ల గురించి తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం పెద్ద షాక్ కు గురవుతున్నాయి.ఫిబ్రవరి నెల 9వ తేదీన ఈ సినిమా మలయాళంలో థియేటర్లలో విడుదల కాగా అక్కడ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఈ మూవీ ఇతర భాషల్లోకి డబ్ అయ్యి అక్కడ కూడా భారీ హిట్ అవ్వడం విశేషం. యూత్ ఎక్కువగా కనెక్ట్ కావడం ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణమని చాలామంది భావిస్తారు. అయితే ప్రేమలు సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయడం ఇప్పట్లో మరో చిన్న సినిమాకు పూర్తిగా చాలా కష్టమేనని తెలుస్తోంది.భారీ బడ్జెట్ కంటే మంచి కంటెంట్ ముఖ్యమని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. యూత్ ను టార్గెట్ చేస్తూ అద్భుతమైన కథ, కథనంతో సినిమాను తెరకెక్కిస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


ఇక ప్రేమలు సినిమా ఓటీటీలో త్వరలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ఈ మూవీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.ప్రేమలు సినిమా ఓటీటీలో ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానుల నుంచి ఎన్నో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి  కొడుకు కార్తికేయ తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేయడం గమనార్హం. ప్రేమలు సినిమా సక్సెస్ తో మరిన్ని యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమాలు తెరకెక్కే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. ప్రేమలు సినిమా ఇప్పటికీ తెలుగులో మంచి వసూళ్లతో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.అలాగే నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా తెలుగు, మలయాళం వెర్షన్ లో వసూళ్లు భారీగా రాబడుతుంది. కేవలం 3 కోట్ల బడ్జెట్ తో పెద్ద సినిమాలకు కూడా సాధ్యం కానీ 100 కోట్ల రికార్డుని ఈ సినిమా చాలా సునాయసంగా సాధించడమంటే మామూలు విషయం కాదు. మరి చూడాలి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో..ఈమధ్య మలయాళం సినిమా ఇండస్ట్రీ వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో కళ కళ లాడిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: