సినిమా రంగం ద్వారా ఎనలేని పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి దృష్టిని పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో రెండు స్థానాల నుండి పోటీ చేసిన పవన్ రెండింటిలోనూ ఓడిపోయాడు. అయినప్పటికీ ఓటమి తనను ఎప్పుడు ఆపలేదు అని ఓటమి భయంతో ఆగిపోను అని తిరిగి ఉత్సాహంతో మరింత ముందుకు దూసుకు వెళ్తాను అని పవన్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు. చెప్పిన విధంగానే ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో కూడా పవన్ రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి దూసుకు వెళుతున్నాడు.

పోయినసారి పవన్ "జనసెన" పార్టీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసింది. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన పార్టీలు అయినటువంటి టిడిపి మరియు బిజెపి లతో కలిసి పోరులోకి దిగబోతోంది. పవన్ ప్రస్తుతం తన ప్రచారాలను జోరుగా ముందుకు తీసుకు వెళుతున్నాడు. ఈసారి పవన్ కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతోన్నారు. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది.  ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రచారాలకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల చివరి నుండి ఈ ప్రాంతంలో పవన్ ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన పోటీ చేయనున్న సంత నియోజకవర్గంలో పాటు పవన్ ఎక్కువ భాగం కాకినాడ , ఏలూరు , పశ్చిమ గోదావరి , తూర్పు గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

కాగా- పిఠాపురంలో ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి ముందే పవన్ కల్యాణ్ ఆ నియోజకవర్గంపై వరాలను కురిపిస్తోన్నారు. శాసన సభ్యుడిగా తనను ఎన్నుకుంటే ఎలాంటి అభివృద్ధి పనులను చేపడతాననేది తాజాగా ప్రకటించారు.  ఈ క్రమంలో ఆరు గ్యారంటిలను ఇచ్చారాయన ... 1. యువత సహా అర్హులైన వారందరికీ ఉద్యోగ అవకాశాల కల్పన 2. చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడం 3. ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురాన్ని అభివృద్ధి 4. పర్యాటక కేంద్రంగానూ అభివృద్ధి పర్చడం 5. ఇక్కడి మత్స్యకారులకు ప్రత్యేకంగా జెట్టీల నిర్మాణాన్ని చేపట్టడం 6. కోస్టల్ కారిడార్‌పై ప్రత్యేక దృష్టి సారించడం- అనే ఆరు హామీలను పవన్ కల్యాణ్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: