టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీ లలో కొన్ని సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన మీనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ లాంటి హీరోలతో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని తెలుగు లో కొన్ని సంవత్సరాల పాటు తిరుగులేని హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.

అలాగే తమిళ్ లో కూడా ఈమె స్టార్ హీరోల సరసన నటించి అద్భుతమైన కెరియర్ ను కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా కొనసాగించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం మీనా విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరి సంసార జీవితం ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో సంతోషంగా ముందుకు సాగింది. కానీ అనుకోకుండా కొంత కాలం క్రితమే విద్యాసాగర్ మరణించారు. ఇక విద్యాసాగర్ మరణించిన తర్వాత మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అని ఇప్పటికే అనేక సార్లు వార్తలు వైరల్ అయ్యాయి.

ఇక ఎట్టకేలకు ఈ వార్తలపై మీనా చాలా గట్టిగా స్పందించింది. తన భర్త మృతి విషాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను. అంతలోనే తనను రెండో పెళ్లి వార్తలు మరింత బాధించాయని మీనా ఆవేదన వ్యక్తం చేశారు. రెండో పెళ్లి వార్తలు మాత్రమే కాకుండా నటుడు ధనుష్‌ తో తనకు సంబంధం అంటగట్టడం మరింత దురదృష్టకరమని ఈమె పేర్కొన్నారు. జీవితంలో అవర్కి ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని ... తన భర్త చనిపోతారని తాను ఏమాత్రం ఊహించలేదని మీనా చెప్పారు. జీవితం గురించి ప్రస్తుతానికైతే ఏమీ ఊహించుకోవడం లేదని ఈమె పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: