కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యాష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ప్రశాంత నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ సిరీస్ మూవీ లతో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కే జి ఎఫ్ పార్ట్ 2 సినిమా విడుదల అయిన తర్వాత ఈయన చాలా కథలను విన్నప్పటికీ దేనిని ఓకే చేయలేదు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ నటుడు గీతా మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో యాష్ కి ఓ సోదరి పాత్ర ఉంటుందట. అది ఈ మూవీ లో చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర నిడివి ఈ సినిమాలో కాస్త తక్కువే ఉన్నప్పటికీ సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పే పాత్రగా ఇది కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అంత ముఖ్యమైన పాత్ర కావడంతో ఇందులో మొదటగా ఈ బృందం వారు కరీనా కపూర్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆమె కూడా కథ మొత్తం విని ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే ఆ తర్వాత ఈ సినిమాకు తేదీలను అడ్జస్ట్ చేయలేక ఈమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక దానితో ఈ సినిమాలో చాలా ముఖ్యమైన సోదరీ పాత్రను నయనతారతో చేయించాలి అని ఈ మూవీ బృందం డిసైడ్ అయినట్లు , అందులో భాగంగా ఈమెను సంప్రదించగా ఈమె కూడా ఈ సినిమాలో యాష్ కి సోదరి పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: