ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాపై వరల్డ్ వైడ్ గా ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అంతా ఈ మూవీ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.ఇక ఈ మూవీ  జూన్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. అంతకన్నా ముందే అసలు కల్కీ అంటే ఏంటి? ఆ ప్రపంచం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని చెప్పేందుకు స్క్రాచ్ పేరిట మూవీ టీమ్ కొన్ని ఎపిసోడ్స్ ని ఆసక్తికరంగా రిలీజ్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా మే 18న స్క్రాచ్ ఎపిసోడ్ 4ని విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ ఎపిసోడ్ గురించే చర్చలు నడుస్తున్నాయి.నిన్నటి నుంచి కల్కీ 2898 ఏడీ సినిమా గురించే ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మన డార్లింగ్ ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేస్తానని చెప్పాడు. అందుకే ఆ బుజ్జి ఎవరో తెలుసుకోవాలి అని అంతా తెగ వెయిట్ చేస్తున్నాడు. ఎప్పటిలాగానే ఈసారి కూడా కల్కీ 2898 ఏడి మూవీ టీమ్ చెపిన్న టైమ్ కి అప్ డేట్ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఆ స్క్రాచ్ ఎపిసోడ్ రానే వచ్చింది. కల్కీ 2898 ఏడీ సినిమా హీరో భైరవ తన బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.ఫస్ట్ అందరూ కూడా అమ్మాయి అని.. ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ చాలా రకాల వార్తలు వచ్చాయి. 


చివరకు బుజ్జి అంటే ఒక కారు అనే విషయాన్ని తాజాగా ఈ ఎపిసోడ్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. కల్కీ 2898 ఏడి మూవీలో ప్రభాస్ వాడేది నిజంగానే సూపర్ ఫ్యూచరిస్టిక్ కారు అనే విషయం దీంతో క్లారిటీ వచ్చేసింది. ఇంకా అంతేకాకుండా ఈ స్క్రాచ్ 4 ఎపిసోడ్ మొత్తం కల్కి సినిమాపైనే అంచనాలను భారీగా పెంచేసింది. ఎందుకంటే ఇప్పటికే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోంది అనే విషయంపై పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఈ తాజా ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ అంచనాలు బాగా పెరిగాయి. ఇంకా అలాగే ప్రభాస్ క్యారెక్టర్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉండబోతోంది అనే విషయం పూర్తిగా అర్థమవుతోంది.ఈ బుజ్జి ఒక రోబో. కానీ, దాని బాడీని కోల్పోతుంది. అందుకే దానిని తీసుకోచ్చి ఒక సూపర్ కారుకు అటాచ్ చేస్తారు. అంటే ట్రాన్సాఫ్మర్స్ లో రేంజ్ లో బుజ్జి ఒక పెద్ద రోబోలాగా మారిపోతుంది. ఎందుకంటే ఒక రోబో హెడ్ ని తీసుకెళ్లి ఆ కారుకు తగిలిస్తున్నారు. పైగా తన బాడీని ఈ హెడ్ ద్వారానే కంట్రోల్ చేస్తుంది అని టీం చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తే.. హాలీవుడ్ ట్రాన్సాఫ్మర్స్ లో రేంజ్ లో ఒక సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: