ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ రోజు. మే 20 వ తేదీన ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఈయన వదులుకున్న ఒక సినిమా గురించి తెలుసుకుందాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను వదులుకున్నాడు. అలా ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీ లలో బొమ్మరిల్లు మూవీ ఒకటి. ఇక ఈ మూవీ ఎందుకు వదులు కోవాల్సి వచ్చింది అనే విషయాన్ని ఆ ఇంటర్వ్యూ ఎన్టీఆర్ తెలియజేశాడు.

ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ... నేను నా కెరియర్ లో కొన్ని సినిమాలను వదులుకున్నాను. అలా కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అవుతాయి అని తెలిసి కూడా వదులుకున్నాను. అలా వదులుకోవడానికి నా ఇమేజ్ కూడా ఒక కారణం. నా ఇమేజ్ వల్ల సినిమా హిట్ కావాలి కానీ ఫ్లాప్ కాకూడదు. ఉదాహరణకు నాకు దిల్ రాజు "బొమ్మరిల్లు" సినిమా కథను వినిపించాడు. ఆ కథ నాకు అద్భుతంగా నచ్చింది. కాకపోతే అది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అందులో యాక్షన్స్ అన్ని వేషాలు ఏమీ ఉండవు.

నా సినిమాకు వచ్చే జనాలు ఎక్కువ శాతం యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి అని , కామెడీ , డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి అని వస్తూ ఉంటారు. కానీ నేను బొమ్మరిల్లు సినిమా కనక చేసినట్లు అయితే వారి అంచనాలను నేను అందుకోలేను. దాని వల్ల నా ఇమేజ్ కారణంగా ఆ సినిమా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల నేను ఆ సినిమా చేయలేదు అని చెప్పాడు. ఇకపోతే సిద్ధార్థ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన బొమ్మరిల్లు సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: