తమిళ సినిమాలతో డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ శంకర్. ఇక ఈయన చేసిన జెంటిల్మెన్ సినిమా నుండి చివరిగా చేసిన రోబో సినిమా వరకు అన్ని ఏదో ఒక సరికొత్త అంశంతో తెరకెక్కిస్తాడు. గ్రాఫికల్ ఓరియంటెడ్ సినిమాలు చేయడంలో శంకర్ నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు . ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన చేస్తున్న సినిమా ఇండియన్ 2.  ఈ సినిమాతో పాటు మరొకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా కూడా చేస్తున్నాడు. త్వరలోనే ఈ

 రెండు సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఒకే సమయంలో ఈ రెండు సినిమాలను చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు శంకర్. ప్రస్తుతం షూటింగ్  పూర్తి చేసుకున్న ఇండియన్ 2  సినిమా నుండి డైరెక్టర్ ఇప్పటివరకు ఒక్క అప్డేట్ ను కూడా విడుదల చేయలేదు. షూటింగ్ మొత్తం పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఇదిలా ఉంటే ఇక షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలైలో విడుదల చేయాలి అని పెద్ద ఎత్తున మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

 అందులో భాగంగానే జూన్ 1న దీనికి సంబంధించిన ఆడియో రిలీజ్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా వినికిడి. అయితే తాజాగా ఇదే విషయంపై కమలహాసన్ ఒక క్లారిటీ ఇచ్చారు.  ఈ ఈవెంట్ కోసం ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ హాజరు కాబోతున్నట్లుగా కూడా వార్తలు వినబడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈవెంట్ కి ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజినీకాంత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోస్ ను రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి పృధ్విరాజ్ సుకుమారన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అయితే జూలై నెలలో సినిమాని విడుదల చేయాలి అని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న శంకర్ ఆడియో ఈవెంట్ ను కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: