పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.డార్లింగ్ కొత్త సినిమా వస్తోందంటే అభిమానుల ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో వస్తున్న హై టెక్నికల్ వాల్యూ మూవీ కల్కీ2898D.టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రభాస్ అన్న పేరు టక్కున వినిపిస్తుంది.. అయితే ప్రభాస్ పెళ్లి గురించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు..కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి పై మాట మారుస్తూనే ఉన్నారు.. ఇప్పటికే ఎన్నో సార్లు పెళ్లి పై రూమర్లు వచ్చాయి.. కానీ డార్లింగ్ మాత్రం స్పందించలేదు.. తాజాగా కల్కి ఈవెంట్ లో పెళ్లి పై ఎట్టకేలకు ఓపెన్ అయ్యాడు.. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..గతంలో ప్రభాస్ పెళ్లి గురించి కొన్ని వార్తలు వినిపించాయి. ఇకపోతే ఆది పురుష్ సినిమా చేస్తున్న సమయంలో కృతి సనన్ తో కూడా పెళ్లి పీటలేకపోతున్నట్లు వార్తలు వినిపించాయి.. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడా స్పందించలేదు.. కేవలం సినిమాల పై మాత్రమే ఫోకస్ పెట్టారు..

 ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. కల్కి సినిమా తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..ప్రభాస్ పెళ్లి కోసం అటు ఫ్యాన్స్.. ఇటు సినీ ప్రముఖులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు డార్లింగ్ గుడ్ న్యూస్ చెబుతాడా అని ఇంట్రెస్టింగ్‏గా చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి తన పెద్దమ్మ శ్యామలదేవి రియాక్ట్ అయిన సంగతి తెలసిందే. కానీ ఇప్పటివరకు డార్లింగ్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ మొదటిసారి తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు ప్రభాస్. నిన్న రాత్రి జరిగిన కల్కి ఈవెంట్లో ప్రభాస్ స్పీచ్ విని ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. ఎప్పుడూ తన మూవీ ప్రమోషన్లలో తక్కువగా మాట్లాడే ప్రభాస్ నిన్న రాత్రి కల్కి ఈవెంట్లో మాత్రం చాలా ఎక్కువ సమయం స్పీచ్ ఇచ్చారు ప్రభాస్. అలాగే తన అమ్మాయిల ఫ్యాన్స్ కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదని అన్నారు.ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. “హాయ్ డార్లింగ్స్. ఇలా చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి మీ సేఫ్టీ కోసమే. సారీ డార్లింగ్స్.

 అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లను చూసి సినీ పరిశ్రమ స్పూర్తి పొందింది. అలాంటి ఇద్దరితో కలిసి నటించడం గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నాగ్ అశ్విన్, అశ్వనీదత్ లకు థాంక్స్. చిన్నప్పుడు సాగర సంగమం చూసి కమల్ సర్ వేసుకున్న దుస్తులు నచ్చి నాకు అలాంటివి కొనివ్వమని మా అమ్మను అడిగేవాణ్ని. ఆయన నటనకు 100 దండాలు. దీపికా, దిశా ఇద్దరు అందమైన అమ్మాయిలు. ఈ వయసులోనూ కోసం ఆరాటపడుతున్నారు అశ్వనీదత్. ఆయనలాగే తన ఇద్దరు కుమార్తెలకు అంటే ఫ్యాషన్. డబ్బుకు వెనకాడకుండా ఈ తీశారు. బుజ్జిని నాగ్ అశ్విన్ ఇంట్రడ్యూస్ చేశాడు” అంటూ చెప్పుకొచ్చాడు.జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారంటూ మీరు పెట్టిన పోస్ట్ చూసి అమ్మాయి హృదయాలు ముక్కలయ్యాయి అని యాంకర్ సుమ అనగా.. వాళ్ల కోసమే పెళ్లి చేసుకోలేదు అంటూ పెళ్లి పై సరదాగా కామెంట్స్ చేశారు. అయితే ప్రభాస్ స్పీచ్ కు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. డార్లింగ్ స్పీచ్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఎప్పుడూ మొహమాటంగా రెండు మాటలు మాట్లాడేసి వెళ్లిపోయే ప్రభాస్ ఈసారి ఎక్కువ సమయం సరదాగా మాట్లాడం చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: