టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చిన్న సినిమాలతోనే భారీ సక్సెస్…లు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే పెద్ద సినిమాల నిర్మాణంలో బిజీగా ఉంటున్న తరుణంలో చిన్న సినిమాలపై సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నట్టు ఆయన పలుమార్లు చెప్పుకొచ్చారు.ఇక దిల్ రాజు తన ప్రొడక్షన్స్ నుంచి సినిమా వస్తుందంటే ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అంతేకాదు ఆ హంగామా కూడా వేరే లెవల్ లో ఉంటుంది. అయితే ఈ శనివారం మే 25 విడుదల కాబోతున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ విషయంలో మాత్రం కాస్త మౌనం పాటిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ది ఫ్యామిలీ స్టార్ విడుదల సమయంలో ఆయన చూపించిన కాన్ఫిడెన్స్, ధైర్యం, మాటలు ఇప్పుడు కనిపించడం లేదు.ఫ్యామిలీ స్టార్ యావరేజ్ టాక్ ను సంపాదించినా ఫీల్ అయ్యే వారు కాదు కావచ్చు ఈ నిర్మాత. ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో.. లవ్ మీ కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా సరే సక్సెస్ అయ్యాక మాట్లాడాలని నిర్ణయించుకున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది.అయితే లవ్ మీ తెరకెక్కించింది ఆయన కూతురే అయినప్పటికీ నిర్మాణ తదితర వ్యవహారాలన్నీ దిల్ రాజు దగ్గరుండి చూసుకున్నారట. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆశిష్ మాట్లాడుతూ ఏకంగా మూతబడ్డ థియేటర్లు కూడా ఈ సినిమాతో ఓపెన్ అవుతాయి అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు.

మరో వైపు దిల్ రాజు రాజకీయ నాయకులకు జూన్ 4 ఎలాగో మాకు మే 25 మాకు అలా అంటూ టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పేశారట. ఇదెలా ఉంటే మహేష్ బాబుతో ఎక్స్ వేదికగా ఓ పాటను రిలీజ్ చేయించారు. కీరవాణి సంగీతం ఆశించిన స్థాయిలో క్రేజ్ ను సంపాదించకపోవడంతో లవ్ మీ సినిమా మీద కాస్త నారాజుగా ఉన్నారట అభిమానులు. పైగా వైష్ణవి చైతన్య బ్రాండ్ కూడా ఏమంత పని చేయడం లేదు అనేది టాక్.ఇవన్నీ గమనిస్తే మొదటి రోజు షో వచ్చిన తర్వాత పబ్లిక్ టాక్ తర్వాత మాత్రమే దిల్ రాజు పెదవి విప్పుతారు కావచ్చు. గత సంవత్సరం దుమారం లేపిన బలగం సినిమా విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా బ్లాక్ బస్టర్ అందుకొని అవార్డులను కొల్లగొట్టింది. ఈ మధ్య హారర్ టచ్ ఉన్న సినిమాలు ఎక్కువే వస్తున్న సంగతి తెలిసిందే. అందులో సక్సెస్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇదే తరహాలో దెయ్యాన్ని ప్రేమించే పాయింట్ తో వచ్చిన లవ్ మీ ఇఫ్ యు కెన్ సినిమా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: