హనుమాన్ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈయన దర్శకత్వంలో వస్తున్న మరొక సినిమా జై హనుమాన్. గత ఎడాది హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రశాంత్ వర్మ దానికి సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ సైతం విడుదల చేశాడు. ఇక అది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైనింగ్ లో

 ఉంది. అయితే ఈ సినిమాలతో పాటు ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ నటుడు రణవీర్ సింగ్ గారితో మరొక సినిమా చేయబోతున్నాడు. అయితే ఆ సినిమాకి బ్రహ్మ రాక్షస్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారట. అంతేకాదు అన్ని భాషల్లో కూడా అదే టైటిల్ ని ఉంచబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అంతేకాదు హనుమాన్ సినిమా తరహా లోనే ఈ సినిమా కూడా తెరకెక్కబోతోంది అని భారీ సాంకేతిక హంగులతో

 ఈ సినిమాను తెక్కించబోతున్నట్లుగా సమాచారం. ఇకపోతే హనుమాన్ జయంతి కి పూజా కార్యక్రమాలతో లాంచ్ కూడా అయింది అని అంటున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ గత కొద్ది రోజుల నుండి ఈ సినిమా ఆగిపోయింది అన్న వార్తలు రావడం మొదలయ్యాయి. దర్శకుడు హీరోకి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి అని అందుకే ఎవరి.దారి వారు చూసుకుంటున్నట్లు గా తెలుస్తోంది. అయితే తాజాగా ఆ వార్తలు పై స్పందించాడు డైరెక్టర్. తాజాగా ఆయన జై హనుమాన్ సినిమా కంటే ముందే బ్రహ్మ రాక్షస్ సినిమా రాబోతోంది అని తెలిపాడు. అంతేకాదు ఈ సినిమా సైతం ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే వస్తుంది అని చెప్పాడు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: