టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం హిందీ వంటి భాషల్లో వరుసగా సినిమాలు చేసి భారీ గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఈ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ సినిమా తండెల్. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా

 నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇకపోతే ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో విశేషమైన స్పందనను అందుకున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా లొకేషన్ కి సంబంధించిన విజువల్స్ కొన్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇందులో సాయి పల్లవి శ్రీకాకుళం అమ్మాయి సత్య అనే పాత్రలో కనిపించబోతోంది. అయితే ఇప్పటికే చందు  టీం లాంచ్ చేసిన సత్య మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఎంతో వైరల్ అయింది. ఇకపోతే

 ఎప్పుడు తెలంగాణ యాసలో అలరించే సాయి పల్లవి ఇప్పుడు శ్రీకాకుళం యాసలో మాట్లాడబోతోంది. దీంతో ఇందులో సాయి పల్లవి ఎలా మాట్లాడుతుంది తన పర్ఫామెన్స్ ఎలా ఉంటుంది అని ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా 2018లో గుజరాత్‌ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్‌ తెరకెక్కుతుండగా.. గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. తండేల్‌ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్‌ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపిస్తుండగా.. సాయిపల్లవి సత్య పాత్రలో అందరినీ ఇంప్రెస్ చేయబోతున్న ఇంట్రడక్షన్‌ వీడియో చెప్పకనే చెబుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: