లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . తమిళ సినిమాల ద్వారా కెరీర్ ను మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ చూపింది . అందులో భాగంగా ఈమె తెలుగు లో నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడం తో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్స్ స్థాయికి వెళ్లి పోయింది . దానితో నయనతార చాలా సంవత్సరాలు కోలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీల లో స్టార్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగించింది.

ఇక ఈ మధ్య కాలంలో ఈమె కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీపై మాత్రమే తన ఇంట్రెస్ట్ లో చూపిస్తుంది . ఏదో అప్పుడు , ఒకటి ఇప్పుడు ఒకటి తెలుగు సినిమాలు చేస్తోంది . సీనియర్ హీరోయిన్ అయినా కూడా లేటెస్ట్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఈమె దూసుకుపోతుంది. ఇకపోతే సీనియర్ హీరోయిన్ అయినా కూడా ఈమె అదిరిపోయే రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమెకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండడంతో నిర్మాతలు కూడా ఈమె ఎంత అడుగుతే అంత ఇచ్చి సినిమాలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం నయనతార కేవలం ఒక్కో మూవీ కి 12 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం షారుక్ ఖాన్ హీరో గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈమెకు హిందీ సినిమాలో కూడా మంచి గుర్తింపు లభించింది. దానితో ఈమెకు ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్ లలో కూడా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: