సరిగ్గా తన పదహారేళ్ల వయసులో ఒకరితో ప్రేమలో పడ్డారని కానీ ఏం సాధించాననే తపన తనలో ఉండడం చేత ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పానని వెల్లడించింది. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మ ప్రేమాయణం కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పటినుంచి పలు రకాల వెబ్ సిరీస్ లతో యాడ్స్లలో రెచ్చిపోయి మరి నటిస్తూ ఉన్నది. ముఖ్యంగా స్పెషల్ సాంగులలో తమన్నా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. టీనేజ్ లవ్ స్టోరీ చెప్పిన తమన్నా ఆ తర్వాత మరొకరితో ప్రేమలో పడ్డానని కూడా వెల్లడించింది.
అయితే ఆ ప్రేమ కూడా ఎక్కువ రోజులు ఉండలేక పోయిందని ప్రతి చిన్న విషయానికి కూడా అతను అబద్ధం ఎక్కువగా చెప్పే వాడని అలాంటి వ్యక్తితో ఎక్కువ రోజులు బంధాన్ని కొనసాగించలేనని చెప్పేసి మరి బ్రేకప్ చూపిందట. మరి రియల్ లైఫ్ లో రెండుసార్లు బ్రేకప్ అయిన తమన్నా మరి మూడవసారి ప్రేమిస్తున్న నటుడు విజయ్ వర్మతో ఆయన వివాహం వరకు వెళ్తుందా లేదా అనే విషయం ఇప్పుడు అభిమానులను ఆందోళన పడేలా చేస్తోంది. ప్రస్తుతం తమన్నా ఓదెల-2 చిత్రంలో నటిస్తూ ఉన్నది. ఈ చిత్రంలో విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.