తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్బాస్ ప్రస్తుత ప్రేక్షకులందరికీ అలరిస్తూ టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది. ఎప్పటిలాగానే హౌస్ లో టాస్కులు నామినేషన్లు ఎలిమినేషన్లు అంటూ ఇక చర్చ వాడి వేడిగానే సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న గొడవలను చూసి ఇక బయట ఉన్న ప్రేక్షకులు తెగ ఆనంద పడిపోతున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్స్ కి ఓటు వేసి గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 అయితే హౌస్ లో ఉన్న కొంత మంది కంటెస్టెంట్స్ మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు అర్థం కావట్లేదు. అలాంటి వారిలో  కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగమణికంఠ ఒకరు అన్న విషయం తెలిసిందే. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో విపరీతంగా ఏడ్చేసి బిగ్ బాస్ కి సైతం కన్నీళ్లు తెప్పించాడు. సింపతి కోసమే అతను ఇలా చేస్తున్నాడు అంటూ కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. దీంతో అతను మొదటి వారమే ఎలిమినేట్ అవుతాడు అని అనుకున్నప్పటికీ.. ఇప్పుడు మూడో వారంలో కొనసాగుతున్నాడు. అయితే హౌస్ లో ఉన్న తోటి కంటెస్టెంట్స్ తో కూడా మణికంఠ వైఖరి కాస్త డిఫరెంట్ గా ఉంది. ఒక్కోసారి ఎమోషనల్ గా వాళ్లతో మాట్లాడుతాడు. ఇంకోసారి వెంటనే సీరియస్ అయిపోతాడు. దీంతో అతనిలో చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి. దీంతో అతని అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రేక్షకులు.


 కానీ మొదటివారంతో పోల్చి చూస్తే అతను కొంచెం స్ట్రాంగ్ అయినట్లే కనిపిస్తున్నాడు. టాస్కులు గేమ్స్ బాగా ఆడుతూ కాస్త ఎక్కువగానే శ్రద్ధ పెడుతున్నాడు.ఇటీవల సోనియాని  గట్టిగా కిస్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సోనియా ఓ పాట పాడి వినిపించగా.. ఇక సోనియా ముందు కూర్చున్న నాగమణికంఠ వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్లి సోనియాకి బుగ్గపై గాఢంగా ఒక ముద్దు పెట్టాడు. దీంతో సోనియా థ్యాంక్స్ అంటూ చెప్పింది. ఇది చూసి అతని అభిమానులే షాక్ అవుతున్నారు. మణికంఠ భయ్యా బాగా మారిపోయావు. ఆ సోనియాతో పెట్టుకోకు చాలా డేంజర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: