
పదేళ్ల తర్వాత పూర్తి స్థాయి మాస్ ఆల్బమ్‌తో ప్రభాస్ రాబోతున్నారు.బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో పాటు ఆ తర్వాత వచ్చిన సినిమాలు దాదాపు అన్నీ భారీ యాక్షన్ సినిమాలు. రెగ్యులర్ ఫార్మట్‌కి భిన్నంగా ఉంటూ వచ్చాయి. అందుకే మాస్ సాంగ్స్‌కి ఆ సినిమాల్లో స్కోప్ లేదు. ఎట్టకేలకు మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో పూర్తి స్థాయి మాస్ ఆల్బమ్‌ను రెడీ చేస్తున్నట్లుగా సంగీత దర్శకుడు తమన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పాటలెలా ఉండబోతున్నాయో కూడా హింట్ ఇచ్చేశాడు. ఆల్బమ్‌లో 6-7 పాటలుంటాయి. నాలుగు పూర్తి చేశాం. మిగిలినవి కంప్లీట్ చేయాల్సి ఉంది. సినిమాలో 30-40 ఓఎస్‌టీ ట్రాక్స్ ఉండబోతున్నాయి. ఇవి టాలీవుడ్‌లో బెస్ట్ ఓఎస్‌టీగా నిలువబోతుందంటూ చెప్పుకొచ్చాడు. ఆల్బమ్‌లో ఇంట్రడక్షన్ సాంగ్, మాస్ నంబర్, ఐటెం సాంగ్, ముగ్గురమ్మాయిలతో సాంగ్ 3 పాటలు తోపాటు థీమ్ సాంగ్ కూడా ఉండబోతుందని, రాజాసాబ్ కోసం డిఫరెంట్ వరల్డ్‌ను సృష్టిస్తున్నామని చెప్పి అభిమానులు, మూవీ లవర్స్‌లో సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాడు థమన్.ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ అద్భుతమంటూ ఆకాశానికెత్తేశాడు థమన్.ఇక ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.