సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న కథను మరొక హీరోతో తెరకెక్కించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా ఒక హీరోతో చేయాలి అనుకొని వేరే హీరోతో సినిమా చేసే సందర్భాలలో ఆ హీరో ఈమేజ్ కి తగ్గట్టు కథలో కొన్ని మార్పులను , చేర్పులను దర్శకులు చేస్తూ ఉంటారు. అలా చేసే క్రమంలో అనేక విషయాలలో కథ మార్పులు చెందుతూ ఉంటుంది. ఇకపోతే ఒక కథను ఒక హీరోతో అనుకొని ఆ తర్వాత తారక్ తో చేసిన సందర్భాలలో ఏకంగా ఒక హీరోయిన్ పాత్రనే దర్శకుడు తీసేసాడట. అసలు ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. ఇకపోతే ఈ మూవీ కథను విజయేంద్ర ప్రసాద్ తారక్ కోసం కాకుండా బాలకృష్ణ కోసం తయారు చేశాడట. కథ మొత్తం తయారు అయిన తర్వాత బాలకృష్ణకు ఆ మూవీ కథను వినిపించగా , ఈ రకం స్టోరీలలో నేను చాలా సార్లు నటించాను. ఇప్పుడు ఇలాంటి స్టోరీ వద్దు అన్నాడట.

దానితో విజయేంద్ర ప్రసాద్ ఆ కథను పక్కన పెట్టగా రాజమౌళి ఈ కథతో ఎన్టీఆర్ తో సినిమా చేస్తే వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయనకు ఈ కథను చెప్పాడట. ఇక ఎన్టీఆర్ కి ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే ఆ సినిమాలో నటిస్తాను అని చెప్పాడట. ఇకపోతే విజయేంద్ర ప్రసాద్ , బాలకృష్ణ కోసం అనుకున్న సమయంలో ఇందులో ముగ్గురు హీరోయిన్ల పాత్రలు ఉండేవట. ఇక ఎన్టీఆర్ ను హీరోగా అనుకున్న తర్వాత ఒక హీరోయిన్ పాత్రను తీసేసి కేవలం ఇద్దరు హీరోయిన్ల పాత్రలతోనే ఈ మూవీ ని తెరకెక్కించాలి అని నిర్ణయం తీసుకున్నారట. అదే విధంగా ఈ మూవీ ని ఇద్దరు హీరోయిన్లతోనే రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: