కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ యాక్షన్ మూవీ కంగువా. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.అయితే ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసారు.అయితే ఈ మూవీలో దేవీశ్రీ సంగీతంపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చాలా రకాల ట్రోల్స్ వచ్చాయి. కొన్ని సీన్స్‌లో విపరీతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారని దేవిశ్రీ ప్రసాద్‌పై కొందరు నెటిజన్స్ విమర్శించారు.ఈ సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా మ‌రో మెట్టు ఎక్కుతాడ‌నుకున్న దేవిశ్రీ ప్ర‌సాద్ విమ‌ర్శ‌లు ఎదుర్కొవాల్సి వచ్చింది.సినిమా చూసి బ‌య‌టికి వ‌చ్చిన వాళ్లంతా అందులోని సౌండ్ ఎఫెక్ట్స్ కి త‌ట్టుకోలేక త‌ల‌లు ప‌ట్టుకున్నారు. సినిమాలో పాత్ర‌లన్నీ అదే ప‌నిగా అరుస్తూ ఉంటే నేప‌థ్య సంగీతం సైతం మ‌రీ లౌడ్‌గా ఉండ‌డం ప్రేక్ష‌కుల‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో సౌండ్ ఎఫెక్ట్స్ గురించి రిలీజ్ టైంలో బాగా ట్రోలింగ్ జ‌రిగింది.దీంతో ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్‌గా ప‌ని చేసిన‌ ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియ‌న్ రసూల్ పొకుట్టి సైతం ప‌రోక్షంగా బ్యాగ్రౌండ్ స్కోర్ మీద అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.ఈ క్రమంలో ఓ  మీడియాతో మాట్లాడిన దేవీశ్రీ ప్రసాద్‌ కంగువా సినిమా సౌండ్‌పై సోషల్‌ మీడియాలో వచ్చిన ట్రోల్స్ గురించి మాట్లాడారు.దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ నేను పెద్దగా పట్టించుకోను. నా పని మీద మాత్రమే ఫోకస్ పెడతా. మనం ఏం చేసినా విమర్శించే వారు విమర్శిస్తూనే ఉంటారు. సూర్య కంగువా ఆల్బమ్‌ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో మణిప్పు పాటపై ప్రశంసలు కూడా వచ్చాయి. సూర్య కూడా నాకు ఫోన్‌ చేసి పాటల గురించి చాలాసేపు మాట్లాడారు. నా పనిని ఆయన మెచ్చుకున్నారు.ప్రతి సినిమాలో మంచి చెడు రెండూ ఉంటాయి. కంగువా మేము ఎంత కష్టపడ్డామో విజువల్స్‌లో చూస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కొందరికీ నచ్చకపోయినప్పటికీ మేం గర్వపడుతున్నాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: