ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ఎంతో మంది నటీనటులు ఒక వివాహం చేసుకొని ఆ వివాహ జీవితం ద్వారా పెద్దగా సంతోషం లేకపోవడం వల్ల విడాకులు తీసుకొని రెండవ వివాహం చేసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఇక రెండవ వివాహంలో కూడా అంతగా సంతృప్తి లేకపోవడంతో రెండవ వివాహానికి కూడా విడాకులు తీసుకొని మూడవ వివాహం చేసుకున్న నటీమణులు కూడా కొంత మంది ఉన్నారు. ఇక ఈ లిస్టు లోకి మరో బాలీవుడ్ బ్యూటీ చేరబోతుంది. ఆమె మరెవరో కాదు రాఖీ సావంత్. ఈ ముద్దుగుమ్మ హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇప్పటికే అనేక హిందీ సినిమాలలో నటించి తన నటనతో , అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇకపోతే ఈమె కొన్ని సంవత్సరాల క్రితం రితేష్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలానికి వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొంత కాలానికి ఈ బ్యూటీ ఆదిల్ ఖాన్ దురానిని పెళ్లి చేసుకుంది. ఇక ఈ పెళ్లి బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. కొంత కాలం క్రితమే వీరు విడిపోయారు.

ఇకపోతే మూడవ పెళ్లికి ఈ నటి సిద్ధం అయ్యింది. అసలు విషయం లోకి వెళితే మరికొన్ని రోజుల్లోనే ఈ బ్యూటీ పాకిస్తాన్ కి చెందిన నటుడు మరియు నిర్మాత అయినటువంటి డోడి ఖాన్ ను వివాహం చేసుకోబోతున్నట్లు ఆమె తన SM లో ప్రకటించింది. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నట్లు , నా జీవితానికి సరైన వ్యక్తి ఇన్నాళ్లకు దొరికాడు అని , ఇస్లామిక్ సాంప్రదాయ ప్రకారం మేం పెళ్లి చేసుకోబోతున్నాం అని ఈ నటి తాజాగా ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: