తొలుత బాలనటిగా మెరిసి, ఆ తర్వాత హీరోయిన్లుగా వెలుగొందిన తారలు ఎందరో ఉన్నారు. కానీ, కొందరు మాత్రం బాలనటులుగానే మిగిలిపోయి, పెద్దయ్యాక నటనను కొనసాగించలేదు. అలాంటి వారిలో అనుష్క మల్హోత్రా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'డాడీ' సినిమాలో చిన్నారిగా కనిపించిన అనుష్కను చాలా మంది గుర్తుపట్టే ఉంటారు. కమర్షియల్‌గా ఆ సినిమా అంతగా ఆడకపోయినా, మంచి కంటెంట్‌ ఉన్న చిత్రంగా ప్రశంసలు అందుకుంది.

'డాడీ' సినిమాలో చిరంజీవి కూతురు అక్షయ పాత్రలో అనుష్క నటించింది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది కాబట్టి, ఆ పాత్ర చాలా కీలకం. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది అనుష్క. అయితే, ఈ సినిమా తర్వాత ఆమె ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. హీరోయిన్‌గా ఎదిగే సత్తా ఉన్నా, అనుష్క నటనను కెరీర్‌గా ఎంచుకోలేదు.

ముంబైలో పుట్టి పెరిగిన అనుష్క మల్హోత్రా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్‌లోని బిర్మింగ్‌హామ్‌లో నివసిస్తోంది. 'డాడీ' సినిమా తర్వాత చదువుపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ బ్రేక్ కాస్తా శాశ్వతంగా ఇండస్ట్రీకి దూరమయ్యేలా చేసింది.

ఇటీవల అనుష్క ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో చాలా మంది అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె అందం అప్పుడే కాదు ఇప్పుడూ అదుర్స్ అనిపిస్తోంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో మైమరపిస్తోంది. అయితే, 22 ఏళ్లుగా వెలుగులోకి రాకపోవడంతో చాలా మంది ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. కానీ, ఆమె కళ్ళు మాత్రం అప్పటిలాగే ఎంతో ఎక్స్‌ప్రెసివ్‌గా ఉన్నాయి.

అనుష్క మల్హోత్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తోంది. చదువు పూర్తయ్యాక ఆమె మళ్లీ నటిస్తుందా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెండితెరపై ఆమె రీఎంట్రీ ఇస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి. ఆమె ఎంట్రీ ఇస్తే కొత్త తరం స్టార్ కిడ్స్ తో యాక్ట్ చేయవచ్చు. మళ్లీ చిరంజీవి మ్యాజిక్ రిపీట్ చేయవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: