తమిళ్ , తెలుగు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటనలో ఆది పినిశెట్టి ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో తమిళ్ తెలుగు సినిమాలలో నటించి మంచు గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన అల్లు అర్జున్ హీరోగా రూపొందిన సరైనోడు సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకున్నాడు. అలాగే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కు సోదరుడు పాత్రలో నటించి కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు శబ్దం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వస్తాయి అని చాలా మంది భావించారు. కానీ ఈ మూవీ కి భారీ కలెక్షన్లు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర దక్కడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

6 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.10 కోట్ల కలెక్షన్లు దక్కగా , తమిళనాడు ఏరియాలో 2.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 40 లక్షల కలెక్షన్లు దక్కాయి. ఓవర్సీస్ లో ఒక కోటి కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఆరు రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2.70 కోట్ల షేర్ ... 5.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ రావడంతో ఈ మూవీ భారీ కళాశాలలో వసూలు చేస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయలేక పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: