టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారిని నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటారు. అలాంటి వారిలో నటుడు కృష్ణ భగవాన్ ఒకరు. ఇతడు తన నటన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో, కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇక కృష్ణ భగవాన్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. 

ఇప్పటివరకు కృష్ణ భగవాన్ తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. కృష్ణ భగవాన్ తనకు సమయం దొరికినప్పుడల్లా పలు చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై నటుడు కృష్ణ భగవాన్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. ఆ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నటుడు కృష్ణ భగవాన్ మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో హాయిగా ఉండే సినిమా రంగాన్ని వదిలిపెట్టి ఎండలో తిరుగుతూ, తెలియని వారితో మాటలు పడుతూ, నమ్మిన పార్టీని పట్టుకొని నిలబడ్డారు. కష్టే ఫలి అని తన కష్టాన్ని నమ్ముకున్నారు.

 కృషి ఉంటే తప్పకుండా సక్సెస్ సాధిస్తామని.... అందుకే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారని కృష్ణ భగవాన్ సంచలన కామెంట్లు చేశాడు. సినిమా షూటింగ్ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా సాదాసీదాగా ఉంటారని కృష్ణ భగవాన్ అన్నారు. ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా సినిమాలలో యాక్టింగ్ చేస్తారని చెప్పాడు. కృష్ణ భగవాన్ షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి. ఈ మాటలు విన్న తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మా దేవుడు అని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: